న్యూయార్క్ : అమెరికాలో కరోనా వైరస్ మహామ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపెడుతోంది. గత కొద్దిరోజుల నుంచి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూపోతోంది. గురువారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 1,06,414 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9.6 మిలియన్లకు చేరింది. కరోనా వైరస్ బారినపడి గడిచిన 24 గంటల్లో దాదాపు 1000 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 2,40,953 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల పెరుగుదల శాతం 7.1గా ఉండగా.. టెస్టుల పెరుగుదల శాతం 6.2శాతంగా ఉంది. ఈ చలి కాలంలో కేసులు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ( ఓట్ల లెక్కింపు ఆపేయండి )
కాగా, అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లతో విజయానికి అతి చేరువలో ఉన్నారు. ఇంకో ఆరు ఓట్లు సాధిస్తే అధ్యక్ష పదవిని సొంతం చేసుకుంటారు. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లకే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment