పారదర్శకంగా ఎన్నికల నామినేషన్ల స్వీకరణ | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

Published Thu, Apr 18 2024 10:30 AM

ఎన్నికల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ - Sakshi

జగిత్యాల: పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా నామి నేషన్‌ స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పనపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. పెండింగ్‌ ఓటరు నమోదు దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఓటరు స్లిప్పులు ఓటరుకు చేరేలా చర్యలు తీసుకోవాలని, ముందస్తుగానే పంపిణీ చేపట్టాలని తెలిపారు. ఈనెల 18న రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, 25 వరకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని వెల్లడించారు. కార్యాలయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, అభ్యర్థుల సహాయార్థం హెల్ప్‌డెస్క్‌ ప్రారంభించాలన్నారు. నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ జరగాలని, రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తదితరులు ఉన్నారు.

ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

Advertisement
Advertisement