చెరువులు, కుంటల పునరుద్ధరణకు కృషి
జగిత్యాలటౌన్: నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు ఎమ్మెల్సీని ఇందిరాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. చెరువులు, కుంటలపై మత్స్యకారులకే అధికారమని, ఇది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కల్పించిన హక్కు అని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ ఏలో చేరుస్తామన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీలం పెద్దులు కోరారు. మంచినీళ్ల బావి చౌరస్తాలో జెండా ఆవిష్కరించారు.
పెద్దమ్మతల్లికి జీవన్‌రెడ్డి పూజలు
రాయికల్: మండలంలోని రామాజీపేటలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఎమ్మెల్సీ పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు నారాయణ, మోహన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు, కిరణ్, సుదీర్‌రెడ్డి, హరీశ్‌రావు, శేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
హామీలన్నీ నెరవేరుస్తాం..
మల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తుందని ఎమ్మెల్సీ అన్నారు. మండలంలోని నడికుడలో మాట్లాడారు. సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే పెట్టుబడిసాయం అందిస్తుందన్నారు. కిసాన్‌కాంగ్రెస్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ వాకిటి సత్యంరెడ్డి, మాజీ సర్పంచ్‌లు నల్ల బాపురెడ్డి, ముద్దం రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment