అంగన్‌వాడీ కేంద్రాల్లో రిజిస్టర్ తప్పనిసరి
రాయికల్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని మైతాపూర్‌లోగల అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువా రం తనిఖీ చేశారు. పిల్లలకు సంబంధించి రిజిస్టర్ నమోదు చేస్తున్నారా..? మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు..? వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేయాలని సూ చించారు. అనంతరం నర్సరీని సందర్శించారు. సీసీరోడ్లు, ఇటిక్యాలలో బ్రిడ్జి నిర్మాణ పనులు, వీరాపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు చపట్టాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ ఖయ్యూం, ఎంపీడీవో చిరంజీవి, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఈఈ అబ్దుల్ రహమాన్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల తనిఖీ
మేడిపల్లి: మేడిపల్లి మండలంలోని కట్లకుంట, పోరుమల్లలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. సెంటర్ల వారీగా ట్యాబ్ డాటా ఎంట్రీ వివరాలు అడిగి తెలసుకున్నారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ సుజాత, సివిల్ సప్లె అధికారులు ఉన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment