సారంగాపూర్: బీర్‌పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వండి మధ్యాహ్న భోజనం దుర్వాసన రావడంతో విద్యార్థులు తినకుండానే ఇంటికి వెళ్లిపోయారు. విద్యార్థులకు గురువారం మధ్యాహ్న భోజనం వడ్డించే సమయంలో పప్పు నుంచి నురగ రావడంతో అనుమానం వచ్చిన విద్యార్థులు వాసన చూశారు. దుర్వాసన రావడంతోపాటు అన్నంలో కలిపి తింటే చేదుగా వస్తోందని ఉపాధ్యాయులకు సమాచా రం ఇచ్చారు. వారు విషయాన్ని ఎంఈవో నాగభూషణం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఎంపీడీవో లచ్చాలుతో కలిసి పాఠశాలకు చేరుకుని వంటలను పరిశీలించారు. పప్పులో పాలకూర మోతాదు ఎక్కువైందని, అందుకే చేదు వచ్చిందని గుర్తించారు. పాలకూర మోతాదు మించితే వాసన రాదని, నాసిరకం పప్పు పెట్టడంతోనే వాసన వచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనం చేసి తిరిగి తరగతులకు హాజరయ్యారు.
తినకుండానే వెళ్లిపోయిన విద్యార్థులు
బీర్‌పూర్ ఉన్నత పాఠశాలలో వెలుగుచూసిన ఘటన
Comments
Please login to add a commentAdd a comment