ధర్మపురి ఆలయ అభివృద్ధికి కృషి
● ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
ధర్మపురి: ధర్మపురి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వేములవాడకు వెళ్తున్న ఆయన విప్ ఆహ్వానం మేరకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాన్ని సందర్శించారు. నృసింహుడి ఆశీస్సులతో పార్టీ అధికారంలోకి వచ్చిందని, స్వామివారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. అభివృద్ధికి ప్రణాళిక తయారు చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు. రైతులకిచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేస్తున్నామని, రూ.రెండు లక్షల రుణం తీసుకున్న రైతులకు మాఫీ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. నాయకులు ఎస్.దినేశ్, చీపిరిశెట్టి రాజేశ్, చిలుముల లక్ష్మణ్, కుంట సుధాకర్, కస్తూరి శ్రీనివాస్, సుముఖ్, స్తంభంకాడి గణేశ్ తదితరులున్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు
జగిత్యాల: ఆర్‌ఎంపీలు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆర్‌ఎంపీ, పీఎంపీలతో సమావేశమయ్యారు. తప్పుడు వైద్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఆర్‌ఎంపీలు డాక్టర్ అని పెట్టుకోవద్దని ఆదేశించారు. సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని మాత్రమే ఉండాలని అన్నారు. రోగులకు ప్రిస్క్రిప్షన్ రాయకూడదన్నారు. చాలామంది ఆర్‌ఎంపీలు ఔషధాలు విక్రయిస్తూ ప్రిస్క్రిప్షన్ రాస్తున్నారని తెలిపారు. డాక్టర్ శ్రీనివాస్, అర్చన, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌కు చేరాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. గురువారం ఉదయం 8.30 గంటల వరకు భీమారం మండలం మన్నెగూడెం, పెగడపల్లి మండల కేంద్రం, బీర్‌పూర్ మండలం కొల్వాయి, మల్యాల మండల కేంద్రంలో 12.8 డిగ్రీల చొప్పున, ఎండపల్లి మండలం గుల్లకోట, కథలాపూర్, భీమారం మండలం గోవిందారంలో 12.9 డిగ్రీల సెల్సి యస్‌గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment