ఆలకించండి సారూ..!
● ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు ● వివిధ సమస్యలపై దరఖాస్తులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్ ● పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం
నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తు చేసుకున్నారు. వారి నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ అర్జీలు స్వీకరించారు. మొత్తంగా సమస్యలపై 33 ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని కొందరు అర్జీదారులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గౌతమ్‌రెడ్డి, బీఎస్.లత, జగిత్యాల, మెట్పల్లి ఆర్డీవోలు పులి మధుసూదన్‌గౌడ్, శ్రీనివాస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment