పెండింగ్ వేతనాల కోసం ఆందోళన
జగిత్యాలటౌన్: గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల చెల్లించాలని ఏఐటీయూసీ అనుబంధం గ్రామపంచాయితీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. జీవో 51ని సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, పాత విధానంలోనే కేటగిరీల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రాక్టర్ డ్రైవర్లకు పంచాయతీ ద్వారానే డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇప్పించాలని కో రారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కా ర్యదర్శులుగా నియమించాలన్నారు. మునుగూరి హనుమంతు, ఎండీ.ఉస్మాన్, వెన్న మహే శ్, బిట్కు రాములు, మోతి మహేశ్, సతీశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment