నేడు ప్రజాపాలన విజయోత్సవం
జగిత్యాల: ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలి పారు. జిల్లాకేంద్రంలోని ఎస్వీఎల్‌ఆర్ గార్డెన్స్‌లో సాయంత్రం సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ అ లేఖ్య కుంజల కళాబృందం ఆధ్వర్యంలో జయజ యహే ప్రజాపాలన పేరుతో కార్యక్రమాలు ఉంటా యన్నారు. ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలు, వివిధ కళారూపాల్లో ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ప్రజలు, ఉద్యోగులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
పరిశుభ్రత అందరి బాధ్యత
పరిశుభ్రత అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్‌లో ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, విద్యుత్‌ను ఆదా చేయాలన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అదనపు కలెక్టర్లు లత, గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment