చిన్నచిన్న గొడవలే..
జగిత్యాల జిల్లాలో హత్యలకు చిన్నచిన్న గొడవలే కారణమవుతున్నాయి. నేరస్తులతోపాటు హత్యకు ప్రోత్సహించిన వారిని టెక్నాలజీ సహాయంతో గుర్తించి, కఠినచర్యలు తీసుకుంటున్నాం. 1, 2 కేసులున్న వారిపై రౌడీషీట్, పీడీయాక్ట్ ఓపెన్ చేస్తున్నాం.
– ఎస్పీ అశోక్‌కుమార్, జగిత్యాల
నేరస్తులకు శిక్ష తప్పదు
కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, అక్రమ సంబంధాల వంటి కారణాలతో ఎక్కువగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. నేరాల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. నేరస్తులకు శిక్ష తప్పదు.
– ఏసీపీ రమేశ్, రామగుండం
నమ్మకం లేకనే..
దంపతులకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. జీవితాంతం కలిసి ఉండాల్సినవారు చంపుకుంటున్నారు. ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతున్న ఫోన్ల వాడకాన్ని తగ్గించుకోవవాలి. మనసువిప్పి, మాట్లాడుకుంటే అనుబంధాన్ని పెంచుకోవచ్చు.– రవివర్మ, మానసిక వైద్య నిపుణులు, రామగుండం
Comments
Please login to add a commentAdd a comment