‘యువ వికాసం’ సభకు తరలిరండి
జగిత్యాలటౌన్: పట్టణంలోని చిరువ్యాపారులకు అండగా నిలిచేందుకు గతంలో తైబజార్ పన్ను మినహాయించి జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపామని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చిరువ్యాపారులకు తైబజార్ చిట్టీ రద్దు చేసి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయం ఆలోచించి రాష్ట్రవ్యాప్తంగా తైబజార్ చిట్టి రద్దు చేయాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, యువత, రైతులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లిలో నిర్వహిస్తున్న యువవికాసం సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నాయకులు కొత్త మోహన్, తాటిపర్తి విజయలక్ష్మి, బండ శంకర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, గుండ మధు, మహేష్, నేహాల్, చాంద్‌పాషా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment