విద్యార్థులు కష్టపడుతున్నందుకా విజయోత్సవాలు..?
సారంగాపూర్: విద్యార్థులు వసతి గృహాల్లో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మరిచిపోయి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. మంగళవారం సారంగాపూర్ మండలకేంద్రంలోని కస్తూరిబా బాలికల విద్యాలయాన్ని ఆమె సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో 200 మంది విద్యార్థినులకు వసతి ఉండగా 300 మందిని ఉంచడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు సబ్బులు, శాంపులు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకుంటున్నామని చెబుతున్నారని, ఇన్ని సమస్యలు ఉన్నా ప్రభుత్వం సంబరాలు జరుపుకోవడం అవివేకమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అనంతుల గంగారెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షుడు సిలివేరి మదన్, నాయకులు రవీందర్‌రెడ్డి, బైరి మల్లేశం, శ్రీను, ఫక్రోద్దీన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment