అభివృద్ధి దిశగా జగిత్యాల
జగిత్యాల: జగిత్యాలను త్వరితగతిన అభివృద్ధి చేస్తున్నామని, రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్, రూ.5 కోట్లతో మహిళా డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేస్తున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ప్రజావిజయోత్సవాల్లో భాగంగా మంగళవారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి నుంచి మహిళలు రుణాలు తీసుకుని వ్యాపారాలు చేసి లాభాలు పొందాలన్నారు. చిరువ్యాపారులకు రూ.25లక్షలు మంజూరు కాగా చెక్కులు అందించామన్నారు. 13 మహిళా సంఘాలకు రూ.3.20 కోట్ల చెక్కులు అందించారు. కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుకు రూ.9లక్షల ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారు. పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్, టీఆర్‌నగర్‌లో రూ.5 కోట్లతో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మున్సిపల్ కార్మికులకు దుస్తులు, సబ్బులు, సేఫ్టీ కిట్స్ అందిస్తున్నట్లు వివరించారు. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్‌తో కలిసి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, గోలి శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు రాంకుమార్, కప్పల శ్రీకాంత్, కృష్ణహరి, జగదీశ్, ధర్మరాజు, జయశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment