పథకాల అమలులో తగ్గేది లేదు
పెగడపల్లి: సంక్షేమ పథకాల అమలులో తగ్గేది లేదని, రైతులకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈనెల 4న పెద్దపల్లిలో సీఎం సభ నేపథ్యంలో మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మండలం నుంచి ఐదు వేల మందిని తరలించాలన్నారు. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీకానీ రైతులుంటే వారి వివరాలు సేకరించి న్యాయం చేస్తామని వెల్లడించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములుగౌడ్, నాయకులు శ్రీనివాస్, తిరుపతి, కిషన్, అనిల్‌గౌడ్, విజయభాస్కర్, మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, అంజయ్య, రాజు, సత్యనారాయణరెడ్డి, విష్ణు, కృష్ణహరి తదితరులు పాల్గొన్నారు.
రైతును రాజును చేస్తాం
ధర్మపురి: రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని విప్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఏడాది కాలంలో తాను చేసిన అభివృద్ధిని ఈనెల 7న ధర్మపురిలో జరిగే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. నాయకులు దినేష్, వేముల రాజేష్, చిలుములు లక్ష్మణ్, సంఘ నర్సీంహులు, చీపిరిశెట్టి రాజేష్, కస్తూరి శ్రీనివాస్, రాందేని మొగిలి తదితరులున్నారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment