హక్కుల సాధనకు ధర్మయుద్ధం
మల్యాల: బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనకు ధర్మయుద్ధం ప్రారంభించామని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన ధర్మయుద్ధం మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక మార్కండేయ దేవాలయం వద్ద ఆయనకు పార్టీ నాయకులు ఉపేంద్ర, ప్రణీత్ స్వాగతం పలి కారు. అంగడి బజార్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా 90శాతం ఉంటే వారి జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించకపోవడంతో కనీస అవసరాలు విద్యా, వైద్యం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. 10శాతం ఉన్న అగ్రవర్ణాలే 90శాతం ఉన్న ప్రజలను పాలిస్తున్నారన్నారు. జనవరి 5 నుంచి ఆదిలాబాద్ నుంచి 15వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో పార్టీ కరీంనగర్ రీజినల్ ఇన్‌చార్జి శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీశ్ గౌడ్, జిల్లా కన్వీనర్ శివ, కో–కన్వీనర్ బింగి అరుణ్ పాల్గొన్నారు.
ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్
Comments
Please login to add a commentAdd a comment