కోరుట్ల బల్దియాకు చేంజ్ మేకర్స్ అవార్డు
కోరుట్ల: కోరుట్ల మున్సిపాలిటీకి కేంద్ర ప్రభుత్వ చేంజ్ మేకర్స్ అవార్డు దక్కింది. ఈ మేరకు బల్దియా కమిషనర్ బట్టు తిరుపతి ఢిల్లీలో గురువారం ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర విజ్ఞాన కేంద్రం అండ్ ఎన్విరాన్మెంట్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన చేంజ్ మేకర్స్ కాంటెస్ట్‌లో పాల్గొనగా.. కోరుట్లకు అవార్డు దక్కింది. ఢిల్లీలోని హాబి టాన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో తిరుపతికి అవార్డు అందించారు. కమిషనర్ మాట్లాడుతూ కోరుట్లకు అవార్డు దక్కటం గర్వంగా ఉందన్నారు. స్వచ్ఛభారత్ మిషన్–2లో భాగంగా సిటీ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ అమలులో సత్ఫలితాలు సాధించినందుకు గుర్తింపు లభించిందన్నారు. పట్టణాల్లో బహిరంగ మల, మూత్ర విసర్జన నియంత్రించటంతోపాటు వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబర్చటం, డీఆర్‌సీసీ సెంటర్, ఎస్‌హెచ్‌జీ ఎస్, పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు అందిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment