పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించాలి
ధర్మపురి: విద్యార్థుల చదువులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఈవో రాము అన్నారు. తెలంగాణ ఆహారోత్సవంలో భాగంగా ధర్మపురిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఫుడ్ పెస్టివల్‌ను ప్రారంభించారు. పది పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులను చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చక్కగా చదివి వందశాతం ఫలితాలు సాధించాలని కోరారు. అంతకముందు ఇళ్ల నుంచి విద్యార్థులు స్వయంగా వండి తెచ్చిన ఆహార పదార్థాలను రుచి చూశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సమతుల ఆహారాన్ని అందించాలని, అప్పుడే విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటారని సూచించారు. అనంతరం గ్రంథాలయాన్ని ప్రారంబించారు. ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేశ్ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌కు చెందిన దయానందరెడ్డి రూ.30 విలువైన పుస్తకాలు, బీరువాను అందించారు. దాతలను డీఈవో అభినందించారు. ఎంఈవో సీతామహలక్ష్మి, హెచ్‌ఎం పెండాల మహేందర్, కొలిచాల శ్రీనివాస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment