ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కాగా చేయాలి
● కలెక్టర్ సత్య ప్రసాద్
పెగడపల్లి: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పక్కగా చేపట్టి మోబైల్ యాప్‌లో అర్హుల వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మండలకేంద్రంలో చేపడుతున్న సర్వేను డీపీవో రఘువరణ్‌తో కలిసి శనివారం పరిశీలించారు. రోజుకు ఎన్ని కుటుంబాలు సర్వే చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. అనంతరం వైకుంఠధామం, డంపింగ్ యార్డు, కంపోస్ట్‌షెడ్లు, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనాల్లో పూలమొక్కలు, పండ్ల తోటలు పెంచాలని సూచించారు. కంపోస్టు షెడ్డులో తడిపొడి చెత్తను వేర్వేరు చేసి తయారైన ఎరువును వన నర్సీరీల్లో మొక్కలకు వినియోగించాలన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ రవీందర్, ఆర్‌ఐ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు ప్రవీణ్, జ్యోతి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment