వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Published Sun, Dec 22 2024 12:26 AM | Last Updated on Sun, Dec 22 2024 12:26 AM

-

ధర్మపురి: కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందండంతో మనస్తాపానికి గరైన తండ్రి తాగుడుకు బానిసై.. మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్మపురిలో చోటు చేసుకొంది. ఎస్సై ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన మామిడి రాజన్న కుమారుడు గణేశ్‌ కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటినుంచి రాజన్న తాగుడుకు బానిసయ్యాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికొచ్చాడు. కుటుంబ సభ్యులు వెంటనే ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌ తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందాడు. రాజన్న భార్య మంగ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మహిళతో బాబా

అసభ్య ప్రవర్తన

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్‌వాడకు చెందిన ఓ మహిళపై లైంగికదాడికి యత్నించిన ఫకీర్‌బాబాపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. మెట్‌పల్లి పట్టణానికి చెందిన మహ్మద్‌ చాంద్‌మియా బాబా వేషంలో ఓ మహిళ ఇంటికి వెళ్లి తావీదులు కడతానని చెప్పి నమ్మించి.. అసభ్య ంగా ప్రవర్తిస్తూ.. అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని బాధితురాలు పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేసింది. బాబాపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

దొంగల ముఠాను

గుర్తించిన పోలీసులు

జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాతబ స్టాండ్‌లో నాలుగు రోజుల క్రితం జగిత్యాల రూ రల్‌ మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన మిట్ట పల్లి జలజ బ్యాగులోని 28 తులాల బంగారాన్ని గు ర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించారు. రెండు ప్రత్యేక బృందాలు నిజామాబా ద్‌, ఆర్మూర్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌, ఔరంగాబా ద్‌, అకోలా ప్రాంతాల్లో ఆరా తీశాయి. త్వరలోనే నిందితులను పట్టుకునే అవకాశం ఉందని సమాచారం.

ఆయిల్‌ పాం సాగు పెంచాలి

జగిత్యాల: ఆయిల్‌ పాం సాగు పెంచేంలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారులతో సమావేశమయ్యారు. క్లస్టర్ల వారీగా రైతులను మోటివేట్‌ చేస్తూ సాగును పెంచాలన్నారు. వానాకాలం సీజన్‌ క్రాప్‌ బుకింగ్‌ మండలాల వారీగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఈ కేవైసీకాని 2600 మంది రైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. రైతుల ఆధార్‌కార్డు లింక్‌ కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏవోలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement