క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి
● జాగ్రత్తలు తీసుకోవాలి ● డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
జగిత్యాల: జిల్లాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, జీవన విధానం మార్చుకోవాలని, జాగ్రత్తలు తప్పనిసరి అని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. శనివారం ఐఎంఏ భవన్‌లో రోటరీ క్లబ్, ఆపి, ఐఎంఏ, ఒమేగా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, ఫుడ్, పొల్యుషన్ ద్వారా ఆహారపు అలవాట్లు, జంక్‌ఫుడ్ వల్ల క్యాన్సర్ వస్తుందని, ప్రజలు గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్, మంచాల కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment