కోరుట్లకు చేరిన శ్రీరాముని స్వర్ణపాదుకలు | - | Sakshi
Sakshi News home page

కోరుట్లకు చేరిన శ్రీరాముని స్వర్ణపాదుకలు

Published Sun, Dec 22 2024 12:26 AM | Last Updated on Sun, Dec 22 2024 12:26 AM

కోరుట్లకు చేరిన శ్రీరాముని స్వర్ణపాదుకలు

కోరుట్లకు చేరిన శ్రీరాముని స్వర్ణపాదుకలు

కోరుట్ల: శ్రీరాముడు హిందువులందరికీ దేవుడని కాంగ్రెస్‌ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. శ్రీరాముని స్వర్ణపాదుకల పల్లకీ యాత్ర శనివారం కోరుట్లకు చేరింది. ఈ సందర్భంగా పట్టణంలోని అష్టలక్ష్మీ సహిత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పల్లకీసేవ నిర్వహించారు. యాత్రికులకు నర్సింగరావు భిక్ష ఏర్పాటు చేయించారు. రామరాజ్య స్థాపనకు భాగ్యనగరం నుంచి ఈనెల 7న ప్రారంభమైన పల్లకీ పాదయాత్ర ఈనెల 30న అయోధ్యకు చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కోరుట్ల, మెట్‌పలి్‌ల్‌ పట్టణాలు, మండలా అధ్యక్షులు తిరుమల గంగాధర్‌, కొంతం రాజం, అంజిరెడ్డి, నాయకులు ఆకుల లింగారెడ్డి, కరుణాకర్‌ రావు, దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement