అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని వినతి
జగిత్యాల: జిల్లా కేంద్రంలో అండర్ డ్రైనేజీ సి స్టం ఏర్పాటు చేసేలా చూడాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్రం చుట్టూ ముప్పాల చెరువు, కండ్లపల్లి చెరువు, మోతె చెరువు, చింతకుంట చెరువు, లింగం చెరువులు ఉన్నాయని, పట్టణం నుంచి వెలువడే మురుగు నీరు చెరువుల్లో కలిసి నీరు కలుషితమవుతుందని పేర్కొన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. అలాగే బీర్‌పూర్ మండలంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు, కేజీబీవీ పాఠశాల స్థలానికి నిధుల మంజూరు అలాగే జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం, అల్లీపూర్ మండలం ఏర్పాటు, జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలను పునర్విభజన చేయాలని కోరారు. వీరు పేర్కొన్న సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
శబరిమలకు ఆర్టీసీ బస్సులు
మల్లాపూర్(కోరుట్ల): కేరళలోని శబరిమలకు ఆర్టీసీ బస్సులను నడిపస్తున్నట్లు కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అన్నారు. మండలకేంద్రంలో అయ్యప్పస్వాములతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. శబరిమల యాత్ర బస్సు బుకింగ్స్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేయొద్దని, ఆర్టీసీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుందని వెల్లడించారు. అయ్యప్ప దీక్ష స్వాముల కోసం 36 సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులను శబరిమలకు కిలోమీటర్ల ప్రాతిపాదికన నడిపిస్తున్నామని తెలిపారు. బస్సుల్లో టీవీ, సెల్‌ఫోన్ చార్జర్ సౌకర్యం ఉంటుందని, పైగా చార్జీల్లో 10 శాతం రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. ఒక్కో బ స్సులో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, వీరిలో ఇద్దరు వంటమనుషులు, ఇ ద్దరు పదేళ్ల లోపు మణికంఠ స్వాములు, ఒక స హాయకుడికి అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అయ్యప్పదీక్ష స్వాములు విని యోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఏలేటి నర్సారెడ్డి, కొమ్ముల జీవన్‌రెడ్డి, పుప్పాల మహేశ్, దొంతి సుధాకర్, భిక్షపతి, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలి
రాయికల్(జగిత్యాల): ఇరవై నాలుగేళ్ల సర్వీస్ పూర్తయిన ఉపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పించాలని ఆర్‌యూపీపీటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ.అబ్దుల్లా ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. భాషా పండితులపై 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన 1/2005 యాక్ట్‌ను రద్దు చేసి భాషోపాధ్యాయులకు నియామకం తేదీ నుంచి స్కూల్ అసిస్టెంట్ హోదా వర్తింపజేసీ సర్వీస్ భద్రత కల్పించాలని కోరారు. 24 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారికి గెజిటెడ్ హోదా కల్పిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదని పేర్కొన్నారు. సుమారు 650 మంది భాషా పండితులకు పదోన్నతి కల్పించాలన్నారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌కు గుర్తింపు కల్పించాలన్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటుకం నరేందర్, చంద సత్యనారాయణ, రాష్ట్ర ప్రతినిధి వంగపల్లి సంపత్ కుమార్, ప్రాథమిక సభ్యులు వేల్పుల స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment