బేకరీలపై నిఘా ఏది..?
జగిత్యాల: బేకరీల్లోని పిజ్జాలు, బర్గర్లు, ఎగ్‌పప్ తదితర ఆహారపదార్థాలు కల్తీమయం అవుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో బేకరీల నిర్వాహకులు అపరిశుభ్ర గదుల్లోనే వాటిని తయారుచేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో గల ఓ బేకరీలో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు తనిఖీ చేస్తే అందులో కుళ్లిన గుడ్లతో చేస్తున్న పిజ్జాలు, బర్గర్లు, కేక్‌లు బయటపడ్డాయి.
కొనితెచ్చుకుంటున్న అనారోగ్యం
మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు స్నాక్స్ కోసం బేకరీలకు వెళ్తుంటారు. కానీ, బేకరీ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో తినుబండారాలను తయారు చేస్తూ జనాలకు అంటగడుతున్నారు. ఇందులో వెజ్, నాన్‌వెజ్ ఫుడ్ ఉంటుండగా, అవి రుచిగా ఉండేందుకు క్యాన్సర్ కారక రసాయనాలు కలుపుతుంటారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండానే జనం వీటిని తింటూ అనారోగ్యం బారినపడుతున్నారు.
కుళ్లిన గుడ్లతో..
బేకరీల్లో తయారు చేసే పదార్థాలకు ప్రధానంగా గుడ్లను వినియోగిస్తారు. ఇటీవల గుడ్డు రేటు పెరగడంతో కొందరు ఎగ్ వ్యాపారులతో కుమ్మకై ్క కుళ్లిన గుడ్లను కొనుగోలు చేసుకుంటూ బేకరీల్లో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ఫిర్యాదు చేస్తే రావడం, ఆమ్యామ్యాలు పుచ్చుకోవడం, చిన్నపాటి జరిమానాలు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తయారీ ఓ చోట.. బేకరీలు మరో చోట
కొందరు బేకరీల నిర్వాహకులు మెయిన్ సెంటర్లలో అద్దాల మేడల్లో దుకాణాలను నిర్వహిస్తూ, తినుబండారాలను వేరే చోట అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయిస్తున్నారు. అధికారులు మాత్రం మెయిన్ సెంటర్లలోని దుకాణాలను తనిఖీ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి.
బ్రాంచ్‌ల పేరిట బేకరీలు
తినుబండారాలు ఓ చోట తయారుచేసి వాటిని ప్యాకింగ్ చేసి బ్రాంచ్‌ల పేరుతో ఏర్పాటు చేసిన బేకరీలకు పంపిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఒక వస్తువు తయారుచేసి ప్యాకింగ్ చేస్తే దానికి ఎమ్మార్పీ, ఎకై ్స్పరీ డేట్ ఉండాలి. అలాంటివేమీ లేకుండానే బ్రెడ్‌లు, కేక్‌లు ఇష్టానుసారంగా తయారుచేస్తూ ప్రజలకు అంటగడుతున్నారు. ఆహార పదార్థాలు తయారు చేసే ప్రాంతాల్లో మున్సిపల్, సంబంధిత అధికారులు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కుళ్లిన గుడ్లు.. పాచిపోయిన కర్రీలు
తనిఖీలు శూన్యం
అపరిశుభ్ర వాతావరణంలోనే తయారీ
Comments
Please login to add a commentAdd a comment