‘భరోసా’తో మరింత భద్రత
● దేశవ్యాప్తంగా భరోసా కేంద్రాలు రాష్ట్రంలోనే.. ● ఒకే గొడుగు కిందకు పోలీస్, వైద్యం, న్యాయసేవలు ● భరోసా కేంద్రాలతో నిందితులకు త్వరగా శిక్షలు ● విలేకరుల సమావేశంలో డీజీపీ డాక్టర్ జితేందర్
కరీంనగర్క్రైం: భరోసా కేంద్రాలతో బాలికలు, మ హిళలకు మరింత భద్రత ఉంటుందని, పోలీస్, వై ద్యం, న్యాయసేవలు ఒకే గొడుకు కిందకు వస్తాయ ని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రంలోని వివిధ విభా గాలను పరిశీలించి.. ఆయా విభాగాలు అందించే సే వలను అడిగి తెలుసుకున్నారు. భరోసాకేంద్రాల ఏ ర్పాటు దేశవ్యాప్తంగా కేవలం మన రాష్ట్రంలోనే ఉందని, ఈ కేంద్రాల ఏర్పాటును సుప్రీంకోర్టు కూడా అభినందించిందని తెలిపారు. కరీంనగర్లో వెయ్యి గజాల స్థలంలో 6,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చాలా అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. సో మవారం నుంచి సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు, పిల్ల ల కోసం పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీవింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్, జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు శిక్షల శాతం పెరుగుతుందన్నారు. బాధిత మహిళలకు మానసిక ప్రోత్సాహం, పోలీస్ సేవలు, అవసరమైన వైద్య సహాయం, న్యాయ సేవ, బాధితులకు సహాయ నిధి వంటి ఇ తర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. భరోసా కేంద్రం ద్వారా పోక్సో కేసుల బారిన పడిన బాధితులకు తక్షణ సహాయం అందించడం, ఎఫ్ఐఆర్ మొదలు కోర్టుల్లో శిక్ష పడేవరకు బాసటగా ని లుస్తుందని వివరించారు. కరీంనగర్ భరోసా కేంద్రంలో ఇప్పటికే ఐదుగురిని నియమించామని మరి న్ని ని యామకాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ సీఐ, షీటీం ఇన్చార్జి శ్రీల త, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్ష న్ సెంటర్, ది కాప్ కెఫెను డీజీపీ జితేందర్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దిన క న్వెన్షన్ సెంటర్, కెఫెను పోలీసు అధికారులు, సి బ్బందికి తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చినందుకు సీపీ అభిషేక్మహంతిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment