ఆదివారం.. సేవలకు సెలవు
● ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రుల్లో వైద్యం కరువు ● విధులకు హాజరుకాని వైద్యులు, సిబ్బంది ● ఓపీ సేవలకూ బ్రేక్ ● అత్యవసర పరిస్థితుల్లో డ్యూటీ డాక్టర్లే దిక్కు ● ‘సాక్షి’ విజిట్‌లో వెలుగులోకి ఆసక్తికర విషయాలు
కరీంనగర్ టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఆదివారం ఓపీకి సెలవు రోజని అధికారులు తెలిపారు. కాగా.. సీవోటీ కూడా సెలవును తలపిస్తోంది. ఉద యం 10 గంటలకు ‘సాక్షి’ విజి ట్ చేయగా సీవోటీ గదిలో ఒక్క డాక్టర్ కూడా లేరు. రోగులు తమ బాధలను నర్స్‌లకు చెప్పుకోవడం కనిపించింది. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్‌కు ఫోన్ చేసి పిలుస్తామని సిబ్బంది చె ప్పారు. అత్యవసర కేసులను వ రంగల్ ఎంజీఎంకు రెఫర్ చేయ డం, లేదంటే లోకల్ ప్రైవేటు ఆస్పత్రులకు పంపి కమీషన్లు దండుకోవడం ఇక్కడ పరిపాటి.
ఎవరికి ఏ ఆపద ఎప్పుడొస్తుందో తెలియదు. తీవ్రమైన జ్వరం వచ్చినా.. ప్రమాదం జరిగినా ఆదివారం వచ్చిందంటే సర్కారు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆధునిక ఆస్పత్రులు, సదుపాయాలు ఉన్నా.. షిఫ్టులవారీగా 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు ఆదివారం సెలవురోజుగా భావించి ఆస్పత్రి వైపే చూడడం లేదు. ఫలితంగా ప్రాణాపాయ పరిస్థితుల్లో సర్కారు ఆస్పత్రికి వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. అనుకోని సంఘటన జరిగితే ప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు సర్కారు ఆస్పత్రులను ‘సాక్షి’ ఆదివారం విజిట్ చేయగా కొన్ని ఆస్పత్రులకు తాళం వేసి ఉండడం గమనార్హం.
సిరిసిల్లటౌన్: జిల్లా ఆస్పత్రిలో ఓపీ గదికి తాళం వేసి ఉంది. ఓిపీకి ఆదివారం సెలవేనని సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లోనూ సెలవు ఉంటుందని వివరించారు. ఎవరైనా వస్తే ఎమర్జెన్సీ వార్డులో డ్యూటీ వైద్యులు సేవలందిస్తారని పేర్కొన్నారు. ఆదివారం, సెలవు రోజుల్లో జిల్లావాసులకు ఎమర్జెన్సీ వైద్యం కావాల్సి వస్తే జిల్లా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు మాత్రమే దిక్కు అని స్థానికులు పేర్కొంటున్నారు.
రాజన్న సిరిసిల్ల
ఓపీవార్డుకు తాళం
కరీంనగర్
సీవోటీ వెలవెల
Comments
Please login to add a commentAdd a comment