అటవీ భూముల ఆక్రమణపై ఆగ్రహం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): అటవీ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. తమ గ్రామ శివారులోని అటవీభూములను కొందరు వ్యక్తులు అడ్డూ అదుపులేకుండా ఆక్రమించి చదును చేస్తున్నా ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆదివారం గ్రామస్తులు సమావేశమయ్యారు. అనంతరం సదరు భూముల వద్దకు వెళ్లి ఆక్రమణలను పరిశీలించారు. ఆక్రమణకు గురైన భూముల్లో కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు ఫోన్‌లో తెలియజేశారు. కాగా, గ్రామస్తులు సమావేశమైన విషయం తెలుకున్న అటవీ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని వారితో మాట్లాడారు. మరోవైపు భూముల ఆక్రమణల విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment