అంజన్న సన్నిధికి శ్రీరామ పాదుకలు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న సన్నిధికి ఆదివారం శ్రీరామ బంగారు పాదుకలు చేరుకున్నాయి. కొండగట్టు గిరి ప్రదక్షిణ రూపకర్త సురేశ్ ఆత్మారామ్ మహారాజ్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది భక్తులు పాదయాత్ర ద్వారా అయోధ్య వెళ్లి బాల రామాలయంలో బంగారు పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తెలంగాణలోని ప్రతీ గ్రామంలో రామపాదుకలను భక్తులకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయోధ్య వెళ్లి శ్రీరామున్ని దర్శించుకోలేని భక్తుల కోసం ఈ పాదుకలను అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆదివారం కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండగట్టులో ప్రత్యేక పూజల అనంతరం అయోధ్యకు బయలుదేరారు. ఈ సందర్భంగా సురేశ్ ఆత్మరామ్ మహారాజ్ మాట్లాడుతూ, ప్రజల్లో రామ భక్తి, దేశభక్తి పెంపొందించడం పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని వివరించారు. లోక కళ్యాణం కోసం చేపడుతున్న ఈ పాదయాత్రలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్‌రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment