No Headline
కోల్‌సిటీ/సుల్తానాబాద్/మంథని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ఆదివారం అందుబాటులో ఉండాల్సిన వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ‘సాక్షి’ విజిట్ చేయగా.. డ్యూటీ డాక్టర్ల గురించి అడిగితే సిబ్బంది పొంతనలేని సమాధానం ఇచ్చారు. ఎమర్జెన్సీ వార్డులో హౌజ్ సర్జన్లను వేస్తూ కొందరు సీనియర్లు ఇతర పనుల్లో బిజీగా ఉంటున్నారని వినికిడి. ఆస్పత్రిలో డాక్టర్లందరూ డ్యూటీలోనే ఉన్నారని, పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని విధుల్లో ఉన్న ఆర్‌ఎంవో తిరుమలేశ వెల్లడించారు.
● మంథని ఆస్పత్రిలో ఆదివారం ఐపీలో ఒకేఒక్క రోగి ఉన్నాడు. ఒక వైద్యుడు, ముగ్గురు స్టాప్ నర్సులు విధుల్లో కనిపించారు. 17 ఓపీలు వచ్చాయి. సమీపంలోని మాతా శిశు కేంద్రంలో సీ్త్ర వైద్య నిపుణురాలు లేకపోవడంతో రోగులు లేక వెలవెలబోయింది.
● సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ముగ్గురికి బదులు ఒక్క నర్సింగ్ ఆఫీసర్, ముగ్గురు అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ సేవలు అందిస్తామని చెబుతున్నా.. అంతకు ముందుగానే ఆస్పత్రి తలుపులు మూసివేయంతో అత్యవసర సేవల కోసం వచ్చిన కొందరు పేషెంట్లు వెనుదిరిగి పోయారు.
పెద్దపల్లి
విధుల్లో నిర్లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment