నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి విడుదల
జగిత్యాలఅగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు ఈనెల 25 నుంచి సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఎల్‌ఎండీ ఎగువ ఆయకట్టుకు నీటి సరఫరాకు ప్రాజెక్టు అధికారులు ప్రణాళిక రూపొందించారు. నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు ఆన్, ఆఫ్ పద్ధతిలో (వారం విడిచి వారం) విడుదల చేయనున్నారు. కాకతీయ కాలువ ద్వారా జోన్–1 ఆయకట్టు (డీ–5 నుంచి డీ–53 వరకు)కు వారం రోజులు, జోన్–2 ఆయకట్టు (డీ–54 నుంచి డీ–94 వరకు)కు వారం రోజులు సరఫరా చేయాలని నిర్ణయించారు. జోన్–2కు ఈనెల 25న జోన్–1కు జనవరి 2 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 8వ తేదీ వరకు పంటలకు సాగునీరు అందించనున్నారు. కాకతీయ కాలువ ద్వారా మూడు నుంచి ఐదువేల క్యూసెక్కుల సామర్థ్యం ఉండేలా చూడనున్నారు. లక్ష్మీ ప్రధాన కాలువకు కూడా సాగు నీటిని విడుదల చేస్తున్నారు.
ఎస్సారెస్పీలో 80.053 టీఎంసీలు
ఎస్సారెస్పీలో ప్రస్తుతం నీటి నిల్వ 1090.90 అడుగులతో 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు కోరుట్ల, జగిత్యాల పట్టణాలకు 61 క్యూసెక్కులు, ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాలకు 63 క్యూసెక్కులు, ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి పట్టణాలకు 107 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకూ చేరేలా..
ఎస్సారెస్పీ నీరు కాలువ చివరి భూములకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కా లు వలపై లస్కర్లు, అధికారులు కాలువలను పరి శీ లించనున్నారు. అలీసాగర్, గుత్పా వంటి ఎత్తి పోతల పథకాలకు కూడా వారబంధీ పద్ధతిలోనే నీటిని సరఫరా చేయనున్నారు. కాలువలకు గండ్లు పడితే వెంటనే మరమ్మతు చర్యలు తీసుకోవా లని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆన్, ఆఫ్ పద్ధతిలో సాగునీరు
ఏప్రిల్ వరకు చివరి తడి
Comments
Please login to add a commentAdd a comment