ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె నోటీసు
జగిత్యాల: సమస్య పరిష్కారానికి కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉ ద్యోగులు.. ఈనెల 27 నుంచి వందశా తం సమ్మెలో పాల్గొంటామంటూ డీఈవో కార్యాలయంలో నోటీసు అందించారు. తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నామని, నవంబర్ 19న నోటీసు ఇచ్చినా ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని, దీంతో ఈనెల 10 నుంచి ఆందోళనలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతలను దృష్టిలో ఉంచుకుని శాంతియుతంగా ఆందోళనలో పాల్గొంటున్నామని, తమ స్థానంలో ఉపాధ్యాయులతో పాఠాలు బోధిస్తూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాత్రివేళల్లోనూ విధులు నిర్వహించకుండా సమ్మెలో పాల్గొంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బర్ల నారాయణ, కొడుకుల రవీందర్, చిట్యాల రవీందర్, అంజయ్య పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. వీరి సమ్మెకు మంగళవారం వివిధ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment