పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
కరీంనగర్‌క్రైం: ఓ మహిళ పోగొట్టుకున్న బ్యాగును కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు వెతికి, ఆమెకు అప్పగించారు. సీఐ కోటేశ్వర్ వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌కు చెందిన కలికోట మౌనిక బుధవారం తన కుటుంబసభ్యులతో కలిసి బస్సులో కేశవపట్నం వెళ్తోంది. కరీంనగర్ బస్టాండ్‌కు చేరుకున్నాక.. బ్యాగులు ఒకే రకంగా ఉండటంతో మరో ప్రయాణికురాలు మౌనిక బ్యాగును తీసుకెళ్లింది. బాధితురాలు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బ్యాగు తీసుకెళ్లిన మహిళ ఓ ఆటో ఎక్కినట్లు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించారు. ఆటోడ్రైవర్ అహ్మద్‌ఖాన్‌కు ఈ విషయం తెలుపగా అతను సదరు మహిళ ఇంటిని చూపించడంతో బ్యాగు దొరికింది. అందులోని బంగారు, వెండి వస్తువులను పోలీసులు బాధితురాలికి అప్పగించారు. బ్యాగును గుర్తించిన క్రైం పార్టీ పోలీస్ కుమార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది అశోక్, ఆటోడ్రైవర్ అహ్మద్ ఖాన్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వాజీజ్ ఖాన్‌లను సీఐ కోటేశ్వర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment