రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్‌లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి యోగా చాంపియన్‌షిప్ పోటీల్లో మంకమ్మతోటలోని సిద్ధార్థ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. 15 మంది బంగారు, 12 మంది రజత పతకాలు సాధించారు. విద్యాసంస్థల అధినేత దాసరి శ్రీపాల్‌రెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
కబడ్డీలో జిల్లా జట్టుకు తృతీయ స్థానం
కరీంనగర్‌స్పోర్ట్స్: మేడ్చల్ జిల్లాలోని హకీంపేటలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా బాలికల జట్టు సత్తా చాటింది. బాలికలు అద్వితీయ పోరాట పటిమను కనబరిచి తృతీయ స్థానం సాధించారు. జిల్లా బాలికల జట్టు నారాయణపేట జిల్లా జట్టుపై 36–22 స్కోర్ తేడాతో విజయం సాధించి తృతీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అమిత్‌కుమార్, మల్లేశ్‌గౌడ్, వర్కింగ్ అధ్యక్షుడు సీహెచ్ సంపత్‌రావు, చైర్మన్ ప్రసాద్‌రావు, వైస్ చైర్మన్ అనూకర్‌రావు, కోచ్ పద్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment