రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మల్లాపూర్: మండలకేంద్రం శివారులో బుధవారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం మల్లాపూర్‌కు చెందిన రామ నర్సయ్య(38) పాతదాంరాజుపల్లి నుంచి మల్లాపూర్ వైపు స్కూటీపై వస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వేములవాడ నితిన్ ద్విచక్రవాహనంపై పాతదాంరాజుపల్లి వైపు అతి వేగంగా వెళ్తూ రామ నర్సయ్య స్కూటీని ఢీ కొట్టాడు. ఈ ఘటనలో నర్సయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నితిన్‌ను ఆసుపత్రికి తరలించారు. రామనర్సయ్యకు భార్య రజిత, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మల్లాపూర్ ఎస్సై రాజు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
వెల్గటూర్:అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గన్నేరువరం చంద్రయ్య (35)పై అదే గ్రామానికి చెందిన ఓ మహిళ 2015 లో లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ప్రస్తుతం ఆ కే సు ట్రయల్‌కు వచ్చింది. ఆ కేసులో తనకు శిక్ష పడుతుందని భయం ఓ వైపు.. హార్వెస్టర్ సరిగా నడవక అప్పులు పెరిగి తీర్చేమార్గం కానరాక జీవితంపై విరక్తితో ఈనెల 19న క్రిమి సంహారక మందు తాగాడు. కరీంనగర్‌లోని ఓ ప్రై వేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. చంద్రయ్య భార్య లత ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment