హరిహరపుత్రనే శరణమయ్యప్ప
కోరుట్ల: ‘స్వామియే శరణమయ్యప్ప.. హరిహరపుత్రనే శరణమయ్యప్ప’..అనే శరణుఘోషతో నెల రోజులుగా కోరుట్ల అయ్యప్ప ఆలయ పరిసరాలు మార్మోగిపోతున్నాయి. అయ్యప్ప జాతరకు ఆలయ ం ముస్తాబైంది. ఈ జాతరకు దాదాపు లక్ష మంది వరకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈమేరకు ఆలయ కమిట ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
ఉదయం నుంచి సాయంత్రం దాకా
శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి అయ్యప్పస్వామికి సుప్రభాతసేవ, మూల విరాట్టుకు అభిషేకాలు, గణపతిహోమం, దివ్యపదునెట్టాంబడి పడిపూజ, రథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. అయ్యప్ప ఆలయ పరిసరాల్లోని అన్నదానం కోసం ఇప్పటికే సుమారు 5 ఎకరాల స్థలంలో పరిసరాలు పరిశుభ్రం చేసి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుమారు వేయి మంది వలంటీర్ల సహకారం తీసుకోనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తెలిపారు. అయ్యప్ప మాలధారులకు, ఇతర భక్తులకు వేర్వేరుగా బిక్ష(అన్నదానం) నిర్వహిస్తున్నట్లు వివరించారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
లక్ష మంది వస్తారని అంచనా
ఏటా డిసెంబర్ 27న జరిగే అయ్యప్ప జాతరకు కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్ మండలాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ జాతరలో సుమారు 50వేల మందికి అన్నదానం చేయనున్నారు. ఈ అన్నదానానికి పెద్ద సంఖ్యలో భక్తులు విరాళాలు అందజేస్తున్నట్లు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు చిద్రాల నారాయణ, అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తెలిపారు. సుమా రు రూ.60లక్షలతో నిర్మించతలపెట్టిన ఆలయ కాంపౌండ్‌కు మాలధారులు సహకరించారని తెలిపారు. ఈనెల 27న జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ కమిటి నిర్వాహకులు కోరారు.
రేపు కోరుట్లలో అయ్యప్ప జాతర
లక్ష మంది భక్తుల హాజరు
సౌకర్యాల కల్పనకు సన్నాహాలు
అన్నదానం కోసం ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment