నాటు వేస్తుండగా మహిళకు గుండెపోటు
● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి
సారంగాపూర్: నాటు వేసేందుకు వెళ్లిన ఓ మహిళకు పొలంలోనే గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటన సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల పోశవ్వ (50) కూలీగా వ్యవసాయ పనులకు వెళ్తోంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా ఓ రైతుకు నాటు వేసేందుకు వెళ్లింది. పొలంలో నాటేస్తుండగానే వాంతులు చేసుకుంది. అక్కడే స్పృహ కోల్పోగా.. తోటి కూలీలు ఆమెను అంబులెన్స్‌లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలోనే మృతిచెందింది. పోశవ్వకు భర్త లచ్చయ్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, కూలీలు కోరారు.
పొలంలోనే ఆగిన గుండె
● పనిచేస్తూ రైతు హఠాన్మరణం
కోనరావుపేట(వేములవాడ) : పొలం పనులు చేసుకుంటున్న ఓ రైతు గుండెపోటుతో పొలంలోనే మృతిచెందాడు. కోనరావుపేట మండలకేంద్రానికి చెందిన దొబ్బల గంగారాం(55) కొన్నేళ్ల క్రిత ం గల్ఫ్‌కు వెళ్లి తిరిగొచ్చాడు. మంగళవారం ఉదయం పొలం వద్ద పనులు చే సుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురయ్యా డు. కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడ ని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమారులు రాహుల్, ప్ర సాద్ ఉన్నా రు. కాగా ప్రసాద్ ఉపాధి నిమిత్తం సౌ దీ అరేబియాకు వెళ్లగా తండ్రి మృతితో ఇంటికి వ స్తున్నాడు. అతడి రాకకోసం ఎదురుచూస్తున్నారు.
చోరీ కేసులో ఏడాది జైలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాచర్లగొల్లపల్లిలోని పిల్లి రణధీర్ ఇంట్లో 2023, సెప్టెంబర్‌లో చోరీకి పాల్పడ్డ దొంగకు ఏడాది జైలుశిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి సృజన బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ శ్రీని వాస్‌గౌడ్ తెలిపిన వివరాలు.. పిల్లి రణధీర్ ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లగా మహా రాష్ట్రకు చెందిన షేక్ ఖయ్యూం ఉరఫ్ రఫీక్‌బేగ్ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి అందులో దాచిన రూ.2లక్షల నగ దు, తులం బంగారు నగలు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సై రమాకాంత్ విచారణ చేపట్టి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. న్యా యమూర్తి కేసు పూర్వాపరాలను పరిశీలించి, ఖ య్యూం దొంగతనం చేసినట్లు నిర్ధారించి జైలుశిక్ష, జరిమానా విధించారు.
ప్రభుత్వ భూమి పట్టా కేసులో ‘విండో’ చైర్మన్ అరెస్ట్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారనే ఆరోపణతో నేరెళ్ల సింగిల్ విండో చైర్మన్ భాస్కర్‌ను తంగళ్లపల్లి పోలీసులు మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. తంగళ్లపల్లిలో ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించగా మరి కొందరు ప్రముఖ నాయకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఆక్రమణల ఆరోపణలు చేసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment