శరవేగంగా డిజిటల్ ఇండియా వైపు
కరీంనగర్‌సిటీ: కోవిడ్ తర్వాత భారత్ డిజిటల్ ఇండియా వైపు శరవేగంగా దూసుకుపోతోందని, అందులో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పాత్ర కీలకమని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ అన్నారు. కరీంనగర్ ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ అటనామస్ కళాశాలలో ఎమర్జింగ్ ట్రెండ్స్ అండ్ చాలెంజర్స్ ఇన్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజెమెంట్ పేరిట జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. దీనికి మంగళవారం ముఖ్య అతిథిగా వీసీ హాజరయ్యారు. 140 పరిశోధన పత్రాలతో రూపొందించిన సావనీర్‌ను ప్రిన్సిపాల్ రామకృష్ణ ఇతర అతిథులతో కలిసి, ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ రామకృష్ణ మాట్లాడుతూ.. అధ్యాపకులందరూ పరి శోధనలపై ఆసక్తి పెంచుకుంటూ విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. జాతీయ సదస్సు వైస్ చైర్మన్ టి.రాజయ్య మాట్లాడుతూ.. దేశంలోని వివి ధ రాష్ట్రాల నుంచి ఈ సదస్సుకు పరిశోధన పత్రాలు వచ్చాయని, వాటిని అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురించనున్నట్లు తెలిపారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఆచార్య బి.రాజశేఖర్ మాట్లాడుతూ.. వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ ఉపయోగించి, వ్యాపార కార్యకలాపాలను సులభంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఉ స్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగానికి చెందిన ఆచార్య ప్యాట్రిక్ ఆంథొని ఈ–కామర్స్‌లోని అధునాతన పోకడలు, సవాళ్లు అనే అంశంపై మా ట్లాడారు. శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్, మేనేజ్‌మెంట్ విభాగ ప్రిన్సిపాల్ డి.హరికాంత్, కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు పి.నితిన్, టి.రాజయ్య, సురేందర్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారత్ దూసుకుపోతోంది
జాతీయ సదస్సులో ‘శాతవాహన’ వీసీ ఉమేశ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment