వైభవంగా తొలిఏకాదశి
● ధర్మపురి నృసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేయాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి: వైకుంఠ ఏకాదశి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈనెల 10న జరిగే ముక్కోటి వేడుకల సందర్భంగా దేవస్థానం కార్యాలయంలో ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించారు. అధికారులు చేపట్టాల్సిన పనులు, అంశాలపై వివరించారు. గతేడాది కంటే వైభవంగా నిర్వహించాలని, ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చాడాలని ఆదేశించారు. వీవీఐపీల దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. గతంలో జరిగిన అసౌకర్యాలు పునరావృతం కాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఉదయం ఐదు గంటలకే ఉత్తర ద్వారం తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేడుకల స్థలాన్ని విప్ పరిశీలించారు. ముఖ్య అర్చకులు నేరెల్ల శ్రీనివాసాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, సీఐ రాంనర్సింహరెడ్డి, ఎస్సై ఉదయ్‌కుమార్, కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ చైతన్య, నాయకులు వేముల రాజు, చిలుముల లక్ష్మణ్, శైలేందర్‌రెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment