‘గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా’ విడుదల చేయండి
జగిత్యాల క్రైం: గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రకటించిన రూ.4.70 కోట్లు తక్షణమే విడుదల చేయాలని గల్ఫ్ ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్ నాయకులు సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబును కలిసి విజ్ఞప్తి చేశారు. ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసినా.. నిధుల విడుదలలో జాప్యం కారణంగా బాధిత కుటుంబాలు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. జగిత్యాలలో 31 మంది, నిజామాబాద్‌లో 28, రాజన్న సిరిసిల్లలో 8, కామారెడ్డి, సిద్దిపేటలో నలుగురు, కరీంనగర్, మంచిర్యాలలో ముగ్గురు, మెదక్‌లో ఇద్దరు, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో కుటుంబానికి మంజూరు పత్రాలు జారీ చేశారని, మొత్తం 94 కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు. గల్ఫ్, సింగపూర్, ఇరాక్, మలేసియాతోపాటు 18 ఈసీఆర్ దేశాల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వర్తింపజేయాలని మంద భీంరెడ్డి, దేవేందర్‌రెడ్డి సీఎంను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment