ఆరోగ్యశ్రీ వినియోగించుకోవాలి
● సాగుకు యోగ్యమైన భూమికే రైతుభరోసా.. ● అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వెల్లడి
జగిత్యాల: ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోకంటే ఎక్కువగానే ప్రజాసంక్షేమ పథకాలను కాంగ్రెస్ అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో రుణమాఫీ అయ్యిందని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే రూ.21వేల కోట్ల రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సన్నాలకు బోనస్ ఇచ్చామని, త్వరలోనే అందరికీ రేషన్‌కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. రైతుభరోసా సాగు యోగ్యమైన భూమికే వస్తుందని తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ, గాజెంగి నందయ్య, బండ శంకర్, రాజేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment