రాష్ట్రంలో నియంత పాలన
● బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి బాపురెడ్డి
కథలాపూర్: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక బాపురెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. ఆదివారం కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జాప్యం చేయడం దారుణమన్నారు. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించడమేంటని ప్రశ్నించారు. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే పసుపు బోర్డు ఏర్పాటైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలు తీసుకొని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదని, ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామని వెల్లడించారు. వారి వెంట మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, నాయకులు బాల్క సంజీవ్, గండ్ర గంగారావు, విజయ, వంగ మహేందర్, తెడ్డు ప్రశాంత్, తిరుజానీ, బద్దం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment