ఆర్జీ–1 ఏరియాలో కార్మికులకు గాయాలు
గోదావరిఖని(రామగుండం): సింగరేణి రామగుండం డివిజన్–1 పరిధిలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు. జీడీకే–11 గనిలో కంటిన్యూస్ మైనర్‌లో తేళ్ల సతీశ్ అనే జనరల్ మజ్దూర్ గునపంతో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు అరచేతికి గాయాలయ్యాయి. అతన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. అలాగే, ఆర్జీ–1 సీఎస్‌పీలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా జనరల్ మజ్దూర్ కార్మికుడు నారదాసు సిద్ద రాజయ్య కుడి చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లారు. కాగా, రక్షణ చర్యల్లో వైఫల్యం వల్లే రెండు ప్రమాదాలు జరిగాయని, నిపుణులైన ఉద్యోగులచే పనులు నిర్వహిస్తే జరిగేవి కావని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. రక్షణ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment