నేడు జిల్లాకు మంత్రుల రాక
జగిత్యాల/ధర్మపురి/కథలాపూర్: ప్రజాపాలన గ్రామసభల నేపథ్యంలో బుధవారం జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.15గంటలకు ధర్మపురికి హెలికాప్టర్‌లో రానున్నారు. అక్కడి నుంచి జైనాలో సాయంత్రం ఐదు గంటల వరకు గ్రామసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5.30గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
ఏర్పాట్లు పరిశీలించిన విప్
జైనాలో నిర్వహించే గ్రామసభలో పాల్గొనడానికి మంత్రులు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పరిశీలించారు.
పర్యటనను విజయవంతం చేయండి
కథలాపూర్ మండలం కలిగోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్న మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. బుధవారం మధ్యాహ్నం 2:30గంటలకు సూరమ్మ ప్రాజెక్టును సందర్శిస్తారని తెలిపారు.
మహిళల సంక్షేమమే ప్రజాపాలన లక్ష్యం
జగిత్యాల: మహిళల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రేషన్‌కార్డులో పేరు లేని వారు ఆందోళన చెందవద్దన్నారు. జిల్లాకేంద్రంలోని 19వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అర్హులందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, కాంగ్రెస్ రూరల్ మండల అధ్యక్షుడు రాజేందర్, అర్బన్ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళన
జగిత్యాల: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశావర్కర్లు జిల్లాకేంద్రంలోని న్యూబస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌కు పాదయాత్రగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రూ.18వేల ఫిక్స్‌డ్ వేతనాన్ని నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.50 వేలు చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఆదివారం, పండుగలకు సెలవులు ఇవ్వాలని కోరారు. పనిభారం తగ్గించాలని, పారితోషికం లేని పనులు చేయించకూడదని కోరారు. మూడేళ్ల లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఇందూరు సులోచన, అధ్యక్షురాలు ఆత్మకూరు లత, ప్రేమలత, జ్యోతి, జీవలక్ష్మీ, వసంత, పద్మ పాల్గొన్నారు.
వాహనాలను జాగ్రత్తగా నడపాలి
జగిత్యాల: ప్రతిఒక్కరూ వాహనాలను జాగ్రత్తగా నడపాలని డీటీవో శ్రీనివాస్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలతో ప్రజలను చైతన్యపర్చారు. కార్యక్రమంలో ఆర్టీఏ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment