ప్రజల సంక్షేమం కోసమే గ్రామసభలు
ధర్మపురి: ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకే గ్రామసభలు నిర్వహిస్తున్నామని ధర్మపు రి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని 13, 15 వార్డుల్లో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. అర్హులై న ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతా య ని అన్నారు. అర్హుల పేర్లు జాబితాలో లేకుంటే అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఇది ఫైనల్ జాబితా కాదని, తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సంగి సత్తమ్మ, వైస్ చైర్మన్ రామన్న, కమిషనర్ శ్రీనివాస్ వార్డు కౌన్సిలర్లు తదితరులున్నారు.
ప్రజల వద్దకే పాలన
వెల్గటూర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని అడ్లూరి అన్నారు. ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామసభలో పాల్గొన్నా రు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ గోపిక, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రె డ్డి, గెల్లు శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.
మళ్లీ దరఖాస్తు చేసుకోండి
మేడిపల్లి: జాబితాలో పేరు లేని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భీమారం మండలకేంద్రంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఏ పథకమైనా ప్రజల సమక్షంలోనే లబ్ధిదారులను గుర్తిస్తామన్నారు. మేడిపల్లి, కమ్మరిపేట, భీమారంలో సభలు నిర్వహించారు.
ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment