ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి
జగిత్యాలటౌన్: ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతిని జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో భారత్ సురక్షాసమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జననమే తప్ప మరణం లేని మహానేత చంద్రబోస్ అని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు ఏసీఎస్.రాజు, అక్కినపెల్లి కాశీనాథం, బండారి మల్లికార్జున్, నరేందుల శ్రీనివాస్, బండి సత్యనారాయణ, ఎడమల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చంద్రబోస్ జీవితంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపాన్యాస పోటీలు నిర్వహించారు. యువకేంద్రం వాలంటీర్ మారం గణేష్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంగీతరాణి, శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment