అనర్హులకు చోటు ఎలా కల్పిస్తారు..?
సారంగాపూర్/మేడిపల్లి: ప్రభుత్వ పథకాలకు అర్హులను కాదని అనర్హులకు చోటు ఎలా కల్పిస్తారని ప్రజలు అధికారులను నిలదీశారు. గురువారం సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల్లో వివిధ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు గ్రామసభలు నిర్వహించారు. ఇందులో అనర్హుల పేర్లు ఉండడంతో గ్రామస్తులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేచపల్లిలో ఎంపీడీవో గంగాధర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. గంగాధర్ మాట్లాడుతూ అనర్హులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వారి పేర్లను తొలగిస్తామన్నారు. అర్హులు ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కందెనకుంట, కొల్వాయి, మంగేళ, కమ్మునూర్, నాయికపుగూడెం, కోనాపూర్, రంగపేట, రేచపల్లి, నాగునూర్ గ్రామాల్లో చేపట్టి గ్రామసభలు ముగిసేవరకూ పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది.
బీజేపీ నాయకుల అరెస్ట్
మేడిపల్లి మండలకేంద్రంలో నిర్వహించిన గ్రామసభకు బీజేపీ నాయకులు వెళ్లారు. లబ్ధిదారుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుండగానే పోలీ సులు అరెస్ట్ చేశారు. వారిని మేడిపల్లి పోలీ స్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పార్టీ వేములవాడ నియోజకవర్గ కన్వీనర్ క్యాతం దశరథ రెడ్డి మాట్లడుతూ పథకాలకు ఎవరిని ఎంపిక చేశారో తెలుసుకుంటుంటే అక్రమంగా అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు తప్పులు కనిపిస్తున్నాయని, అందుకే భయపడుతున్నారని తెలిపారు. గ్రామసభకు అందరూ వస్తార ని, ఎవరినీ రానీయకుంటే కాంగ్రెస్ నాయకుల లబ్ధిదారుల సభ అని పెట్టుకోవాలని ఆగ్రహం వ్య క్తం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ముంజ శ్రీనివాస్ తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
రేచపల్లిలో గందరగోళంగా గ్రామసభ
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
మేడిపల్లిలో బీజేపీ నాయకుల అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment