పథకాల అమలులో ప్రభుత్వం విఫలం
జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. వచ్చేది మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం భీమేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట కమలాకర్‌రావు, గంగారెడ్డి, మహేశ్, లింగన్న, రాజలింగం, తిరుపతి, ప్రమోద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment