![కోలుకొండ దుర్గామాత ఉత్సవాల్లో మంత్రి
- Sakshi](/styles/webp/s3/article_images/2023/02/26/25plky151-330019_mr_1.jpg.webp?itok=tz8NJhKj)
కోలుకొండ దుర్గామాత ఉత్సవాల్లో మంత్రి
దేవరుప్పుల: సర్వమత సంప్రదాయాల పరిరక్షణ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండల పరిధి కోలుకొండలో శనివారం జరిగిన శ్రీ దుర్గామాత, బొడ్రాయి పునఃప్రతిష్ఠాప న, శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భగా మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలు జరుపుకునే పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్.. ఆలయాల పూజారులకు ధూపదీన నైవేద్యం, బతుకమ్మ పండుగకు మహిళలకు చీరెలు, క్రిస్టమస్, రంజాన్ పండుగలకు వస్త్రాలు పంపిణీ చేస్తూ ఆధ్యాత్మిక సమాజ స్థాపనకు పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆరాధ్య పౌండేష న్ జిల్లా అధ్యక్షుడు ముస్త్యాల కుమారస్వామి ఆధ్వర్యంలో రూ.3 లక్షలతో గనుపాక జ్యోతి కుటుంబా నికి నిర్మించిన నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ కె.రవి, ఉపసర్పంచ్ కృష్ణమూర్తి, ఎంపీటీసీ దామెర రమ, రైతు కోఆర్డినేటర్ కోతి పద్మ, మార్కెట్ డైరెక్టర్ బోనగిరి యాకస్వామి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దయాకర్, రవి, పల్ల సుందర్‌రామి రెడి, కొల్లూరి సోమన్న, రాజు, బాబు, అర్జున్, కోతి ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ‘ఎర్రబెల్లి’
Comments
Please login to add a commentAdd a comment