![బీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి ఎర్రబెల్లి - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/26/25plky152-330019_mr_0.jpg.webp?itok=VFWzJpf8)
బీఆర్‌ఎస్‌లో చేరిన వారితో మంత్రి ఎర్రబెల్లి
దేవరుప్పుల: త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుంచి లక్ష మెజారిటీతో సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా యువజన నాయకుడు, ప్రముఖ సామాజికవేత్త బ బ్బూరి శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో ధరావత్ తండా, గోప్యనాయక్ తండా గ్రామాలకు చెందిన పలువు రు కాంగ్రెస్ ముఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి సమక్షాన బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీ ఆర్ పరిపాలనను చూసి జాతీయస్థాయి హోదాకు ఎదుగుతున్న బీఆర్‌ఎస్‌కు నీరాజనం పలుకుతున్నారని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో బానోత్ జగన్, ధరావత్ కీమానాయక్, బి.సురేష్, బి.అశోక్, జి.అశోక్, సిద్దు, గౌతమ్, వినోద్, సందీప్, ప్రవీణ్, వెంకన్న, నితీష్‌సాయి, సుమన్, యాకు, శ్రీను, వంశీ, యాకన్న, రవి, హరీష్, నవీన్, చంద్రభాన్, సోమన్న కీమా, శ్రీరామ్, శంకర్, రాజు, స్వామి, రమేష్ సోమన్న ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, పల్ల సుందర్ రాంరెడ్డి, సర్పంచ్ బానోత్ గేమానాయక్, దేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment