మెరుగైన సేవలు అందించాలి | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలు అందించాలి

Published Sat, Apr 20 2024 1:55 AM

శిక్షణ కార్యక్రమంలో 
మాట్లాడుతున్న సీఎండీ వరుణ్‌రెడ్డి  - Sakshi

ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

జనగామ రూరల్‌: విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అదించాలని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దేవరుప్పు ల సబ్‌ డివిజన్‌ విద్యుత్‌ సిబ్బంది, అధికారులకు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. బిల్లుల వసూలు, విద్యుత్‌ మీటర్ల నిర్వహణ, లైన్ల పర్యవేక్షణ చేపట్టా లని చెప్పారు. ట్రాన్స్‌ఫార్మర్లలో నిర్వహణ లోపాలు ఉంటే సరిచేసుకోవాలని, కొత్త లైన్లు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనధికారిక విద్యుత్‌ వినియోగంపై దృష్టి సారించి ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సబ్‌ డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. రఘునాథపల్లిలో 20న, స్టేషన్‌ఘన్‌పూర్‌ 22న, పాలకుర్తి వారికి 23న శిక్షణ ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ సదర్‌లాల్‌, ఎస్‌ఈ వేణుమాధవ్‌, డీఈ లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్‌, డీఈ ఇన్‌చార్జ్‌ ప్రభావతి, ఏడీఈ అనిల్‌కుమార్‌, ఏఎస్‌ఓ జయరాజు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement