ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
జనగామ: స్థానిక వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీపీ రాజమహేందర్ నాయక్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్లో ఏర్పాట్లు, సౌకర్యాలపై మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ డీసీపీకి వివరించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలని డీసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, మార్కెట్ ప్రత్యేక శ్రేణి సెక్రటరీ శ్రీనివాస్, సూపర్వైజర్, శ్రీనివాస్, ఏఈఓ అనిల్, ఐకేపీ సెంటర్ నిర్వాహకులు, రైతులు శ్రీనివాస్, రాజు, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment